పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలతోపాటు, బిజినెస్ ప్లానింగ్‌లో కూడా బిజిగా ఉన్నారని వార్తలొస్తున్నాయి. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హోటల్ బిజినెస్‌వైపు ఎక్కువ ఇంటస్ట్ర్ చూపుతున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ ఈ బిజినెస్‌ను మనదేశంలోనే కాకుండా.. ఇటలీ, స్పెయిన్, దుబారు వంటి దేశాల్లో కూడా వ్యాప్తి చేయాలనీ చూస్తున్నడట. మన తెలుగు రుచులను విదేశీయులకు రుచి చూపించాలన్న ప్రభాస్ కోరిక బాగానే ఉన్నా.. వైరల్ అవుతున్న ఈ వార్తలపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ చేతిలో ఇప్పటికే అరడజను చిత్రాలున్నాయి. దాదాపు రెండేళ్లవరకు వరుస బిజీ షెడ్యూల్స్ మధ్య ఈ బిజినెస్ అవసరమా? ప్రభాస్ ఆరోగ్యం చెడిపోతుందని? ముందు ఆరోగ్యంపై శద్ధ్రపెట్టమని రెబల్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
