జనవరి 14 న సంక్రాంతి కానుకగా “రాధేశ్యామ్”

ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా, కె.రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న పీరియాడిక్‌ లవ్‌స్టోరి ‘రాధే శ్యామ్‌’. ఈ చిత్రాన్ని జనవరి 14న సంక్రాతికి విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రభాస్‌ పోస్టర్‌ను విడదల చేసింది. 1960ల నాటి ఇటలీ బ్యాక్‌ డ్రాప్‌లో నడిచే ఈ చిత్రంలో విక్రమాదిత్యగా ప్రభాస్‌, ప్రేరణగా పూజా కనిపించనున్నారు. 2018లోనే అధికారికంగా ప్రకటించిన ‘రాధే శ్యామ్‌’ కరోనా, ఇతర అనేక కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇటీవలే హైదరాబాద్‌లో తిరిగి షూటింగ్‌ ప్రారంభించిన చిత్రబృందం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసింది.