సీఎం జగన్ ని కలిసిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని

ప్రకాశం జిల్లా ఒంగోలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు రాజకీయ అంశాలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు.