ప్రెగ్నెంట్స్ గుడ్డు తినొచ్చా..

పిల్లల్ని కనాలన్న ఆలోచన ప్రతి మహిళకి ఉంటుంది. చాలా మందికి ఇదో వరం లాంటిది కూడా.. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా మెలగాలి. తినే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు గుడ్డు తినొచ్చా.. తినడం వల్ల వారి శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి.. పుట్టబోయే పిల్లలకి ఎలాంటి మేలు జరుగుతుంది.. ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి..

గర్భవతులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో వారు తీసుకునే ఆహారం వారికి మాత్రమే కాదు.. ఇద్దరు ప్రాణుల కోసమని తీసుకోవాలి. ఈ నేపథ్యంలోనే మంచి బలమైన ఆహారం తీసుకోవాలి. దీంతో ఇద్దరికీ పోషణ అందేవిధంగా ఆహారం తీసుకోవాలి. అయితే, తీసుకోమన్నాం కదా అని ఏ ఆహారాన్ని పడితే ఆ ఆహారం తీసుకోకూడదు. బలమైన ఆహారాల్లో గుడ్డు కూడా ఒకటి. వీటిల్లో ఎన్నో ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. ఇవి ప్రతి ఒక్కరికీ మేలు చేస్తాయి. వీటిలోని ఎన్నో ప్రత్యేక గుణాలు శరీరానికి శక్తిని అందిస్తుంది. అయితే, మరి గర్భిణీలు గుడ్డును తినొచ్చా..

గర్భంతో ఉన్నప్పుడు గుడ్డు అత్తుత్తమ ఆహారం అని చెబుతున్నారు నిపుణులు. ఇది తల్లికి పూర్తి పోషణ అందిస్తుందని.. ఇది తల్లికి, పుట్టబోయే పిల్లలకి పూర్తి పోషణ అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. గర్బిణీలు రెగ్యులర్‌గా గుడ్లు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ నిక్షేపాలు సమతుల్యం అవుతాయి. అందుకని కచ్చితంగా గర్భిణీలుగుడ్డు తినొచ్చు.. అయితే, తల్లికి మాత్రమే కాదు.. గుడ్డు తినడం వల్ల బేబి బ్రెయిన్‌ కూడా డెవలప్ కూడా అవుతుందని చెబుతున్నారు.