15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

భారతదేశానికి ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్‌ హాలులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని సుప్రీంకోర్టు సీజే ఎన్వీ రమణ చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ,  రాంనాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, గవర్నర్‌, ముఖ్యమంత్రి, పార్లమెంట్‌ సభ్యులు, ప్రభుత్వంలోని ప్రముఖ సివిల్‌, మిలటరీ అధికారులు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు అయ్యారు.

ద్రౌపది ముర్ము 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ప్రమాణ స్వీకారం తర్వాత ఆమె తొలి ప్రసంగం చేశారు.  పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో వేడుక ముగిసిన తర్వాత, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరుతారు. కాగా, 2017లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రాంనాథ్‌ కోవింద్‌ పదవీ కాలం ముగిసింది. నిన్న ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ముర్ము ప్రమాణ స్వీకారం తర్వాత పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. ఆమెతో పాటు రాంనాథ్ కోవింద్ కూడా ఉన్నారు.