రైలులో ప్రయాణించిన రాష్ట్రపతి దంపతులు

భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ తన భార్య సవితాదేవితో కలిసి యూపీ కాన్పూర్‌లోని స్వస్థలానికి రైలులో బయలుదేరారు. ఢిల్లీ సప్ధర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక రైలు ఎక్కగా.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, రైల్వేబోర్డు చైర్మన్‌, సీఈఓ సునీశ్‌ శర్మ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపికను అందజేశారు. రాంనాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొదటిసారిగా స్వగ్రామానికి రైలులో వెళ్తున్నారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి రైలులో బయలుదేరగా.. సాయంత్రానికి కాన్పూర్‌ చేరుకుంటుంది.