ఎంగేజ్‌మెంట్ ఫొటోలు పంచుకున్న సిద్ధార్థ్-నీలం..

బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంకచోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన నీలం ఉపాధ్యాయ‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని నిన్న వీరిద్దరూ ఇన్‌‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ ఫొటోలు షేర్ చేశారు. ప్రియాంక కూడా ఇన్‌స్టా స్టోరీస్‌లో సిద్ధార్థ్, నీలం ఫొటోలను షర్ చేసింది. ఈ ఫొటోల్లో ప్రియాంక భర్త నిక్ జొనాస్ కూడా కనిపించాడు. సిద్ధార్థ్‌కు ఇంతకుముందు ఇషితా కుమార్‌తో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 2019లో వీరి వివాహం జరగాల్సి ఉండగా అనూహ్యంగా రద్దు చేసుకున్నారు.

నీలం ఉపాధ్యాయ 2010లో తొలి సినిమా చేసిన రెండేళ్ల తర్వాత తెలుగులో మిస్టర్ 7 అనే సినిమాలో నటించింది. 2013లో అల్లరి నరేశ్‌తో యాక్షన్ త్రీడీ నటించింది. అదే ఏడాది ఉన్నోడు ఒరు నాల్ తో తమిళంలో అరంగేట్రం చేసింది.