నిర్మాత,దర్శకుడు. యు.విశ్వేశ్వరరావు కన్నుమూత

విప్లవ భావాలతో కెరియర్‌ను ఆరంభించి ఎన్నో హిట్‌ సినిమాలను అందించిన విశ్వశాంతి విశ్వేశ్వరరావు కరోనాతో చెన్నైలో కన్నుమూశారు. కంచుకోట, నిలువుదోపిడీ, దేశోద్ధారకుడు, మార్పు, తీర్పు, హరిశ్చెంద్రుడు లాంటి హిట్‌ సినిమాలను నిర్మించిన విశ్వేశ్వరరావు.. నందమూరి తారక రామారావుతో 4 సూపర్‌ హిట్లను ఇచ్చి స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న విశ్వేశ్వరరావు వయసు 90 ఏళ్ళ పైమాటే ! మహానటుడు ఎన్‌టిఆర్‌ కు విశ్వేశ్వరరావు వియ్యంకుడు. ఎన్‌టిఆర్‌ కుమారుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ నందమూరి మోహనకృష్ణకు, విశ్వేశ్వరరావు కూతురు శాంతి భార్య. మోహనకృష్ణ, శాంతి కుమారుడే యువ హీరో నందమూరి తారకరత్న.