దిగొచ్చిన స్టార్‌ హీరోలు

టాలీవుడ్‌ బంద్‌ నిర్ణయంతో స్టార్‌ హీరోలు దిగొచ్చారు. నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుండటంతో ఆగస్టు 1 నుంచి షూటింగులు నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో  సెట్స్‌పై ఉన్న సినిమా షూటింగులన్నీ నిలిచిపోనున్నాయి.  ఈ నిర్ణయంపై  ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు స్టార్‌ హీరోలతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. పలువురు హీరోలు తమ రెమ్యునరేషన్‌ తగ్గించుకునేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. వీరిలో ఎన్‌టిఆర్‌; రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ ఉన్నారు. వీళ్లంతా వచ్చే సినిమాల నుంచి తమ రెమ్యునరేషన్‌ తగ్గించుకుంటామని దిల్‌ రాజుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మిగతా హీరోలతో ఈ అంశంపై చర్చిస్తామని నిర్మాతలు వెల్లడించారు.బుధవారం మధ్యాహ్నం మరోసారి కౌన్సిల్‌ సమావేశం కానుంది. ఇప్పటికే షూటింగుల బంద్‌పై నిర్మాతల మండలికి మెగాస్టార్‌ చిరంజీవి లేఖ రాశారు. దీనిపై అందరూ చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.