పుష్ప ది రూల్‌ నుండి ఓ క్రేజీ అప్డేట్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించినప్పటినుంచే పుష్ప-2పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో, పుష్పకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప ది రూల్ నుంచి నిన్న తాజా కబురు వచ్చింది. ఈ సినిమా నుంచి గ్రాండ్ టీజర్ ను ఏప్రిల్ 8న రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో, అభిమానులకు అదిరిపోయే టీజర్ ను కానుకగా అందిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న పుష్ప-2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఆగ‌స్టు 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.