‘పుష్ప’ సెకండ్‌ సింగిల్‌

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల రష్మిక ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన చిత్ర బృందం, తాజాగా ఆమెకు సంబంధించిన మరో అప్‌డేట్‌ను ప్రకటించింది. దసరా సందర్భంగా సెకండ్‌ సింగిల్‌ పేరు రష్మిక సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.