‘సామి సామి’ అంటూ రష్మికతో మాస్ సాంగ్ పాడించిన పుష్ప రాజ్

‘పుష్ప’ చిత్రం నుంచి ఓ మాస్‌ పాట విడుదల కానుంది. ముందుగా ‘సామీ సామీ’ అనే ఈ పాట ప్రోమోను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. ఈ ప్రోమో చూస్తుంటే శ్రీవల్లి, పుష్పరాజ్‌ మధ్య మంచి మాస్‌ బీట్‌ను ప్లాన్‌ చేశారనిపిస్తోంది దర్శకుడు సుకుమార్‌. ఈ మొత్తం పాటను 28న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు పాటలు విడుదల చేశారు. ఈ పాటను గాయని మౌనిక పాడగా, చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది.