‘రాధేశ్యామ్‌’ నుంచి రెండో పాట

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తోన్న ‘రాధేశ్యామ్‌’ సినిమా నుంచి మరో సాంగ్‌ వచ్చేసింది. ముందుగా హిందీలో చిత్రీకరించిన ఆషికీ ఆ గయా సాంగ్‌ను బుధవారం (డిసెంబర్‌ 1) విడుదల చేశారు మేకర్స్‌. పాట ఆరంభంలో ‘నిన్ను నువ్వు రోమియో అనుకుంటున్నావా ?’ అని పూజా, ప్రభాస్‌ను అంటే.. ‘అతడు ప్రేమ కోసం ప్రాణాలిచ్చాడు. నేను ఆ టైపు కాదు’ అని ప్రభాస్‌ బదులిస్తాడు. దీనికి ‘కానీ, నేను జూలియెట్‌. నన్ను ప్రేమిస్తే తప్పకుండా చచ్చిపోతావ్‌’ అని పూజా రొమాంటిక్‌గా వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ‘కానీ నేను మాత్రం ఫ్లర్టేషన్‌షిప్‌ కోరుకుంటున్నా’ అంటూ ప్రభాస్‌, పూజను కిస్‌ చేయడంతో పాట మొదలవుతుంది.