కరోనా పై రాజమౌళి షార్ట్‌ ఫిల్మ్‌

రాజమౌళి ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌ నిలిచి పోయింది. ఈ విరామ సమయంలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చేయిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి కరోనా వారియర్స్‌పై షార్ట్‌ ఫిల్మ్‌ తీస్తున్నాడని తెలిసింది. ఈ చిన్న చిత్రం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖపై ఉండనుంది. కరోనా తో చనిపోయిన కొందరు పోలీసులతో పాటు డ్యూటీ నిర్వహిస్తున్న పోలీసులను, జనాలకు సాయం అందిస్తున్న వారిపై కూడా ఈ చిత్రం ఉండబోతోంది. దాదాపుగా 20 నిమిషాల పాటు ఉండే ఈ షార్ట్‌ ఫిల్మ్‌ త్వరలో సోషల్‌ మీడియా ద్వారా స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.