ప్రారంభమైన రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌

ప్రారంభమైన రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లోనాలుగు రాజ్యసభ స్థానాలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో శుక్రవారం ఉదయం రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలంతా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. సాయంత్రం 5 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు. పోలింగ్‌కు ముందు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు ఏర్పాట్లను సమీక్షించారు. శాసనసభలోని మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే ఒక్కో అభ్యర్థి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు 36 తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరమవుతాయి. పోలింగ్‌లో పాల్గొనే సభ్యుల సంఖ్య తగ్గితే ఆ మేరకు గెలిచేందుకు అవసరమయ్యే ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉంది.