రాజ్య‌స‌భ సభాపతి సీట్ లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

రీసెంట్ గా రాజ్య‌స‌భ వైఎస్ చైర్మ‌న్ ప్యానెల్ లో చోటు ద‌క్కించుకున్నారు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి. ఈ క్రమంలో ఆయనకు అరుదైన అవకాశం లభించింది. రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గైర్హాజరీలో సభా సమావేశాలను నిర్వహించే అవకాశం విజయసాయికి దక్కింది. ప్యానెల్ వైస్ చైర్మన్ హోదాలో ఆయన ఇవాళ సభాపతి సీట్ లో దర్శనమిచ్చారు. కాసేపు సభా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాట్లాడుతూ సభను నడిపించారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ స్టేట్ పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.