రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో మద్యం బాటిళ్లు

రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో మద్యం బాటిళ్లు

గత రెండుమూడు రోజులుగా రకుల్ ప్రీత్ సింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చేతిలో ఓ రెండు బాటిల్స్ పట్టుకొని నెమ్మదిగా రోడ్డు దాటుతూ కనిపిస్తోంది రకుల్. అయితే ఆ బాటిల్స్ ఏంటనేవి మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ”రకుల్ ప్రీత్ సింగ్ మద్యం కొనుగోలు చేసింది.. కావాలంటే ఆమె చేతిలో ఉన్న మద్యం బాటిళ్లు చూడండి” అని పేర్కొంటున్నారు నెటిజన్స్. వీడియో చూస్తుంటే అలాగే అనిపిస్తుండటంతో అందరూ షేర్ చేసుకున్నారు. దీంతో బాలీవుడ్ టు టాలీవుడ్ ఎక్కడ చూసినా అదే టాపిక్ చర్చనీయాంశంగా మారింది.