సైలెంట్ గా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్న రకుల్‌ ..

అందాల ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్ సింగ్- జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉన్నట్లుగా రకుల్‌ ప్రకటించి చాలా కాలం అయ్యింది. ఎట్టకేలకు వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గోవాలో జరిగిన వీరి వివాహానికి కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరు అయ్యారు. మొదటి నుంచి కూడా రకుల్‌ పెళ్లి గురించి రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్ కాన్సెప్ట్‌ ను రకుల్‌ ప్లాన్‌ చేసుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయం పక్కన పెడితే పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది… పెళ్లిలో రకుల్‌ ప్రీత్ సింగ్ చాలా చాలా సంతోషంగా కనిపించింది.

తాజాగా రకుల్ తన ఇన్ స్టా పేజ్ ద్వారా పెళ్లి వీడియోను షేర్ చేసింది. పెళ్లి వీడియో మొత్తంలో కూడా రకుల్‌ చాలా సంతోషంగా కనిపిస్తూ నవ్వుతూ ఉంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంతోషం ఆమెలో కనిపిస్తుంది. అందాల రకుల్‌ ప్రీత్‌ సింగ్ -జాకీ భగ్నానీ ల యొక్క జోడీకి అంతా ఫిదా అవుతున్నారు. పెళ్లి వేడుకలో రకుల్ – జాకీ భగ్నానీ బాగా ఎంజాయ్ చేశారని ఈ వీడియోతో తెలుస్తుంది. మొత్తానికి రకుల్‌ ప్రీత్ సింగ్‌ వివాహ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ కొన్ని నిమిషాల్లోనే లక్షల వ్యూస్ ను , లక్షల్లో లైక్స్ ను సొంతం చేసుకుంటుంది. హీరోయిన్ గా ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో ఆఫర్లు అందుకోలేక పోయిన రకుల్‌… పెళ్లి తర్వాత మళ్లీ బాలీవుడ్ , టాలీవుడ్ లో రకుల్‌ బిజీ అవుతుందనే టాక్ వినిస్తుంది.