చరణ్, ఆలియా గెటప్స్ లీక్..

చరణ్, ఆలియా గెటప్స్ లీక్..

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘RRR’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరిగిపోతోంది. అయితే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గెటప్‌లో రామ్ చరణ్, సీతా మహాలక్ష్మి గెటప్‌లో ఆలియా భట్ ఫొటోలు బయటికి వచ్చాయి.

సీతారామరాజు, సీతా మహాలక్ష్మిగా రామ్ చరణ్, ఆలియా భట్ ఇలాగే కనిపించబోతున్నారా? ఈ విషయం క్లారిటీగా చెప్పలేం కానీ.. సినిమా సర్కిల్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఈ ఫొటో బయటికి వచ్చింది. బ్రిటిష్ పోలీస్ డ్రెస్‌లో చరణ్, ఆయన సతీమణి సీత పాత్రలో ఆలియా పాతకాలం నాటి ఫొటోగా దీనిని డిజైన్ చేసారు. సినిమాలో వీరి గెటప్స్ ఇలాగే ఉంటాయని అంటున్నారు.