రామ్ గోపాల్ వర్మకు షాకిచ్చిన పవర్ స్టార్!

సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మకు షాకిచ్చారట జూనియర్ పవర్ స్టార్. అదేనండీ అర్థం కాలేదా! ఆయన రూపొందించబోతున్న ‘పవర్ స్టార్’ సినిమాలో నటించబోయే నటుడు హ్యాండిచ్చాడట. ఈ సినిమాలో నటించడం కుదరదని తెగేసి చెప్పేశాడట. దీంతో వర్మకు దిమ్మతిరిగి పోయిందనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘పవర్ స్టార్’ పేరుతో సినిమా తీస్తున్నట్లు వర్మ ప్రకటన చేయగానే సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ లైఫ్ ఆధారంగా ఈ మూవీ చేస్తున్నారంటూ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాదు ఇందులో నటించబోయే నటుడు, ఇతనే పవర్ స్టార్ అంటూ ఓ వ్యక్తిని చూపిస్తూ ఆయన విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో కనిపించిన వ్యక్తి అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉండటం మరింత ఆసక్తి రేకెత్తించింది.