కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి క్యారెక్టర్ లో నటిస్తున్న రామ్

యంగ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇచ్చిన కిక్ తో వరుసగా మాస్ సినిమా కథలను లైన్ లో పెడుతున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత రామ్ తిరుమల కిశోర్ దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేసాడు. ఈ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రామ్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేశారు. ఇక ఇప్పుడు తమిళ్ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు ఈ ఉస్తాద్ . యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ హై వోల్టెజ్ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభించె సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా రివెంజ్ నేపథ్యంలో ఉండబోతుందని టాక్. అంతేగాక ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్  చూడని విధంగా ఉంటుందని అంటున్నారు.