రాప్తాడు ‘సిద్ధం’ సభ వాయిదా: పెద్దిరెడ్డి

ఈ నెల 11న రాప్తాడులో జరగాల్సిన ‘సిద్ధం’ సభ వాయిదా పడినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సభను ఈ నెల 18న నిర్వహిస్తామని ప్రకటించారు. ‘చంద్రబాబు పొత్తుల కోసం తహతహలాడుతున్నారు. ఎంతమందితో కలిసివచ్చినా వైసీపీదే విజయం. వలంటీర్లపై ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోంది. కరోనా సమయంలో వారి సేవలు మరువలేనివి’ అని ఆయన పేర్కొన్నారు.