పేద‌ల ఆక‌లి తీరుస్తోన్న రాశీఖ‌న్నా

కొవిడ్ సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆప‌న్నుల‌కు అండ‌గా నిలుస్తున్నారు హీరోయిన్ రాశీఖ‌న్నా. ఎంద‌రో సెల‌బ్రిటీలు పేద‌ల‌కు, ఇబ్బందుల్లో ఉన్న వారికి త‌మ వంతు సాయాన్ని అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వీరి బాట‌లోనే రాశీఖ‌న్నా కూడా అడుగు పెట్టారు. లాక్‌డౌన్ కార‌ణంగా ప‌నిలేక తిన‌డానికి తిండి లేకుండా ఇబ్బందులు ప‌డుతున్న వారికి ఆహారాన్ని అందించే ప‌నికి శ్రీకారం చుట్టారు. రోటీ బ్యాంక్ అనే స్వ‌చ్చంద సంస్థ‌తో క‌లిసి రాశీఖన్నా పేద‌ల‌కు త‌న వంతుగా తోడ్పాటును అందిస్తున్నారు. వాలంటీర్స్‌తో క‌లిసి వృద్ధాశ్ర‌మాల‌కు, రోడ్డుపై ఉండే జంతువుల‌కు ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం విరాళాల‌ను సేక‌రించ‌డానికి ముందుకు వ‌చ్చారు రాశి. అందుకోసం ఓ వీడియో కూడా విడుద‌ల చేసి విరాళాలు అందించాల‌ని కోరారు.