రతన్ టాటా ట్వీట్‌కు కేటీఆర్ స్పందన..

రతన్ టాటా ట్వీట్‌కు కేటీఆర్ స్పందన..

స్ఫూర్తిమంతమైన విషయాలను ఇంటర్నెట్‌లో యువతతో పంచుకోవడంలో టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్ రతన్ టాటా ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం ఓ వీడియోను ట్వీట్ చేశారు. 2.2 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో పెద్ద సందేశం ఉంది. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాల్సిన ఆవశ్యకతను చాటే లక్ష్యంతో రూపొందించిన వీడియో ఇది. పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు, వారి కుటుంబం అనుభవించే వ్యధను ఆ వీడియో కళ్లకు కడుతోంది. దీనిపై కేటీఆర్ స్పందించి రీట్వీట్ చేశారు. ‘‘దయచేసి ఈ వీడియోను చివరివరకూ చూడండి. తడి, పొడి చెత్తలను వేరు చేయడం ద్వారా మన పారిశుద్ధ్య కార్మికులకు మనం ఎలా మేలు చేయగలమో పరిశీలించండి’’ అని ట్వీట్‌లో రాశారు.