రాజమండ్రి సెంట్రల్ జైల్లో రవితేజ

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రవితేజ

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. ‘బలుపు’ వంటి హిట్ సినిమా తరవాత వీరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ‘క్రాక్’పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన టీజర్ కూడా బాగుండటంతో మళ్లీ ప్రేక్షకుల దృష్టి మాస్ మహారాజాపై పడింది. ప్రస్తుతం ‘క్రాక్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తయింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో ‘క్రాక్’ షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. రవితేజపై కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.