మేడారం ఆదాయం రికార్డులు బ్రేక్..

మేడారం ఆదాయం రికార్డులు బ్రేక్..

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపుల్లో నయా రికార్డులు నమోదయ్యాయి. ఇప్పటికే హుండీ ఆదాయం పాత రికార్డులను బ్రేక్ చేసింది. 2018 జాతర సందర్భంగా 10 కోట్ల 17 లక్షల 50 వేల 363 రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. ఈసారి ఇప్పటికే దీన్ని మించి ఆదాయం సమకూరింది. ఇప్పటి వరకు 10 కోట్ల 29 లక్షల 92 వేల రూపాయలు లెక్కించారు. మొత్తం 494 హుండీలు ఉండగా.. 7వ రోజైన మంగళవారం (ఫిబ్రవరి 18) నాటికి 420 హుండీల్లో లెక్కింపు ముగిసింది.

ఈ ఏడాది మేడారం జాతర అట్టహాసంగా సాగింది. భక్తులు భారీగా తరలి వచ్చారు. అమ్మవార్లకు మెక్కులు తీర్చుకుని హుండీలో కానుకలు సమర్పించుకున్నారు. ఆ హుండీల్లో భక్తులు వేసిన కానుకల లెక్కింపు ఏడు రోజులగా హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో జరుగుతోంది. ఇంకా 74 హుండీల్లో ఆదాయం లెక్కించాల్సి ఉంది. ఇందు కోసం మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.