టాలీవుడ్‌లో తీవ్ర విషాదం..శ్రీ రామకృష్ణ కన్నుమూశారు.

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. మాటల అనువాద రచయిత శ్రీ రామకృష్ణ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన చేన్నైలొని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన తెలుగు గాయకుడు మనోను- సూపర్ స్టార్ రజినీకాంత్ కు పరిచయం చేశారు. అప్పటి నుంచి మనో రజినీకాంత్ అన్ని సినిమాలకు తెలుగు డబ్బింగ్ చెబుతూ వస్తున్నారు. శ్రీ రామకృష్ణ చివరగా.. దర్బార్ సినిమాకు తెలుగు డైలాగ్స్ రాశారు. తెనాలికి చెందిన ఆయన చైన్నైలో సెటిల్ అయ్యారు. కాగా శ్రీ రామకృష్ణ 300 చిత్రాలకు పైగా చిత్రాలకు తెలుగు అనువాద రచయితగా మాటలు, డైలాగ్స్ రాశారు. ముఖ్యంగా తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయ్యే అన్ని సినిమాల్లో శ్రీ రామకృష్ణ తనదైన శైలిలో మాటలు, డబ్బింగ్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.