తెలంగాణలో మంచి నీటి సమస్యలు రాకుండా రేవంత్‌ కీలక నిర్ణయం..!

తెలంగాణలో మంచి నీటి సమస్యలు రాకుండా రేవంత్‌ సర్కార్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి సరఫరాను మరింత సమర్థవంతంగా చేసేందుకు ప్రతీ మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ప్రతీ రోజు మంచినీటి సరఫరాను పర్యవేక్షించడానికి ప్రతీ మండలానికి జిల్లా స్థాయి అధికారిని, ప్రతీ వార్డు, గ్రామానికి మండల స్థాయి అధికారిని నియమిస్తున్నట్టు చెప్పారు.

స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం జిల్లాలో మంచినీటి సరఫరాను పర్యవేక్షిస్తారని అన్నారు. ఏగ్రామంలోనైనా మంచినీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడితే, ఆయా గ్రామాల్లోని వ్యవసాయ బావుల నుండి అద్దె ప్రాతిపదికపై నీటిని సరఫరా చేయాలని సూచించారు.