“కొండా” దంపతులపై రామ్ గోపాల్ వర్మ సినిమా

రాంగోపాల్‌ వర్మ ‘కొండా’ పేరుతో కొత్త సినిమాను తీస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో కాంగ్రెస్‌ నేతలు కొండా మురళీధర్‌ రావు, సురేఖ దంపతుల జీవితాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన వాయిస్‌తో ఓ వీడియోను కూడా విడుదల చేశారు. వరంగల్‌ పరిసర ప్రాంతాల్లో త్వరలో షూటింగ్‌ ప్రారంభించనున్నారు. దర్శకుడు ఈ మధ్య కాలంలో మాజీ నక్సలైట్లు, పోలీసులను కలిసిన నేపథ్యంలో ఆసక్తికర విషయాలు తెలిసాయన్నారు. అప్పుడే ఈ సినిమా తీయాలన్న ఆలోచన కలిగిందన్నారు. ఈ సినిమా కోసం కొండా మురళిని కలిసినట్లు ఆయన సహకారంతో కథ రాస్తున్నట్లు వివరించారు. త్వరలోనే చిత్రం పూర్తి చేస్తానన్నారు.