పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రిచా గంగోపాధ్యాయ

లీడర్‌, మిర్చి ఫేం రిచా గంగోపాధ్యాయ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. మే నెల 27న బాబు పుట్టాడని, అతడికి లూకాషాన్‌ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. లూకా రాకతో తల్లిదండ్రులుగా తామేంతో సంతోషంగా ఉన్నామని, అచ్చు తండ్రి రూపురేఖలు వచ్చాయని అన్నారు. నువ్వు మా జీవితాల్లో, మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని నింపుకొచ్చావు అంటూ రాసుకొచ్చారు. దీనితో పాటు బాబు ఫోటోలను కూడా షేర్‌ చేశారు. 2010 లీడర్‌తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రిచా…నాగవల్లి, మిరపకారు, సారొచ్చారు, మిర్చి వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్నారు. నాగార్జున భారు సినిమా తర్వాత 2019లో ఉన్నత విద్యను అమెరికా వెళ్లారు. అప్పటి నుండి సినిమా రంగానికి దూరంగానే ఉంటున్నారు. అనంతరం తన సహచరి విద్యార్థి జోను ప్రేమించి ..పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.