షర్మిలకు ఆ ఒక్క గుర్తింపు తప్ప మరేమీ లేదు: రోజా

ఏపీలో టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి వచ్చిందంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని… అందుకే జనసేనాని పవన్ కల్యాణ్ ను వీరు రంగంలోకి దించారని చెప్పారు. ఇప్పడు పవన్ కల్యాణ్ మాటలు కూడా వివి విని బోర్ కొట్టడంతో షర్మిలను రంగంలోకి దించారని ఎద్దేవా చేశారు. షర్మిల మాట్లాడుతున్న ప్రతి మాట కూడా చంద్రబాబు స్క్రిప్టేనని అన్నారు. చంద్రబాబు కోవర్ట్ రేవంత్ రెడ్డితో షర్మిల పొత్తు పెట్టుకుందని అన్నారు. వినేవాడు వెర్రివాడైతే… చెప్పేవాడు షర్మిల అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కూతురు అనే గుర్తింపు తప్ప షర్మిలకు మరే గుర్తింపు లేదని ఎద్దేవా చేశారు.