RRR మరింత లేట్‌

బాహుబలి తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ వచ్చే ఏడాదిలో కూడా విడుదలకు సిద్ధంగా లేదని సినీ వర్గాల సమాచారం. ఈ సినిమా మొదట 2021లో జూన్‌ లేదా జూలై నెలలో విడుదల అవుతుందని ప్రకటించినా.. మరికాస్త సమయం పడుతుందని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌ జరిగితే ఈపాటికి ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుంటుండేది. కరోనావల్ల షూటింగ్స్‌ ఆగిపోవడం… ఇటీవల కొద్దినెలల నుంచి తగు జాగ్రత్తలతో షూటింగ్స్‌ జరిగినా విడుదలకు మరికొంత సమయం పడుతుందని వార్తలొస్తున్నాయి. ఇటీవల జరిగిన షూటింగ్స్‌లో కూడా ప్రధానమైన యాక్షన్‌ సన్నివేశాలనే తెరకెక్కించారట. ఇంకా రామ్‌చరణ్‌తో ఆలియా, ఎన్టీఆర్‌తో ఒలివియాతో కలిపి చిత్రీకరణ జరపాల్సి ఉందట. అలాగే ఈ చిత్రానికి గ్రాఫిక్స్‌ పనులు ఎక్కువగా ఉండడంతో… కరోనా వల్ల గ్రాఫిక్స్‌ కంపెనీల ఉద్యోగులు కూడా లేకపోవడం వల్ల పనులు ఆగిపోయాయి. ఇటువంటి కారణాల రీత్యా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ విడుదల ఆలస్యమవుతున్న కొద్దీ చరణ్‌, ఎన్టీఆర్‌ అభిమానుల్లో నిరాశ కలిగిస్తోందని చెప్పుకోవచ్చు.