రెండు పాటలు మినహా ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తి

టాలీవుడ్ లో మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్. మెగా నందమూరి హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కోసం అభిమానులే కాదు.. యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తుంది. కరోనా నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్న వేళ ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నా ఫ్యాన్స్ కు చిత్ర బృందం సరికొత్త అప్డేట్ ఇచ్చింది.

ఆర్ఆర్ఆర్ మూవీ రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం పూర్తి అయ్యిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇప్పటికే రెండు భాషల్లో డబ్బింగ్‌ పూర్తిచేశారు. ఇతర భాషలకి త్వరలోనే డబ్బింగ్‌ చెప్పనున్నారని చిత్ర బృదం తెలిపింది. అంతేకాదు పోస్ట్ పొడక్షన్ వర్క్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, కొత్త విడుదల తేదీని ప్రకటించేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు.