వాలంటీర్ వ్యవస్థను ఎవ్వరూ ఏం చేయలేరు : సజ్జల

ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయించొద్దని రీసెంట్ గా ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఏపీలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే 400 మంది రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే ఈ ఇష్యూపై తాజాగా ఏపీ రాష్ట్ర సలహా దారుడు సజ్జల స్పందించి.. ‘‘వాలంటీర్లపై కావాలనే టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. వాలంటీర్లపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ వృద్ధులు ఎండల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందంటూ సజ్జల మండిపడ్డారు.