ప్రభాస్ హీరో నటిస్తున్న ‘సలార్’ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’ వరుస షూటింగ్‌ల మధ్య సలార్‌ని పూర్తి చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా నిలుస్తుందని చిత్రనిర్మాతలు తెలిపారు. ప్రభాస్‌కు జోడిగా శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. ‘రాధే శ్యామ్’ని 2022 సంక్రాంతికి విడుదల చేస్తుండగా, ‘ఆదిపురుష్’ ఆగష్టు 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తర్వాత ప్రభాస్ సందీప్ వంగా దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించనున్నారు.
