‘ఖిలాడి’ రీమేక్‌ చేయబోతున్న సల్మాన్‌

చాలాకాలంగా దక్షిణాది రీమేక్‌లతో బ్లాక్‌ బస్టర్లు హిట్లు కొడుతున్నారు బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌. తాజాగా రవితేజ నటిస్తున్న ‘ఖిలాడి’ చిత్ర రీమేక్‌ హక్కులను ఆయన కొనుగోలు చేశారు. హిందీ వెర్షన్‌ కి కూడా రమేష్‌ వర్మనే డైరెక్ట్‌ చేయాలని ఆఫర్‌ చేశారని తెలుస్తోంది. ‘ఖిలాడీ’ టీజర్‌ నచ్చి, మేకర్స్‌్‌ ద్వారా కథ కూడా బావుందని తెలిసి హక్కులు కొనుగోలు చేశారని సమాచారం. ఇదివరకే రవితేజ నటించిన ‘కిక్‌’తో సల్మాన్‌ పెద్ద హిట్టు కొట్టాడు. ఇప్పుడు ‘ఖిలాడీ’ వర్కవుటవుతుందో లేదో చూద్దాం.