అక్కినేని పేరు తొల‌గింపుపై సమంత క్లారిటీ

అక్కినేని వారి కోడ‌లు, స్టార్ హీరోయిన్ స‌మంత ఇప్పుడు చాలా పరిమితంగానే సినిమాల‌కు సైన్ చేస్తూ వ‌స్తున్నారు. చైత‌న్య‌తో పెళ్లి త‌ర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు స‌మంత ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. మ‌రోవైపు వ్యాపార రంగంలోనూ, సోష‌ల్ మీడియాలోనూ  బిజీగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే కొన్ని సంద‌ర్భాల్లో సామ్ త‌నకు తానుగా కాంట్ర‌వ‌ర్సీలకు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతున్నారు. పెళ్లి త‌ర్వాత స‌మంత అక్కినేని అంటూ త‌న ఇన్‌స్టా ప్రొఫైల్ పేరును మార్చుకున్న ఈ అమ్మ‌డు రీసెంట్‌గా, అక్కినేని పేరుని తీసేసి, కేవ‌లం ‘ఎస్’ అనే అక్ష‌రాన్ని మాత్ర‌మే ఉంచింది. దీంతో సోష‌ల్ మీడియాలో చాలా ర‌కాలైన వార్త‌లు వినిపించాయి. ఈ వార్త‌ల‌పై అప్ప‌ట్లో స‌మంత స్పందించ‌లేదు. అయితే రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ప్రొఫైల్ నేమ్‌ను ‘ఎస్‌’ అని మార్చుకోవడంపై మాట్లాడుతూ తన చుట్టూ ఉన్న వివాదాల గురించి ఎప్పుడు ప‌డితే అప్పుడు మాట్లాడ‌లేన‌ని, ఇష్టం వ‌చ్చిన‌ప్పుడే మాట్లాడుతాన‌ని చెప్పిన సామ్‌.. ఎవ‌రి సొంత అభిప్రాయాలు వారివేన‌ని, త‌న‌కు కాంట్ర‌వ‌ర్సీలు గురించి మాట్లాడ‌టం న‌చ్చ‌ద‌ని చెప్పుకొచ్చారు.