‘పుష్ప’లో సమంత స్పెషల్ సాంగ్

అల్లు అర్జున్‌ నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ప్రస్తుతం ఆయన, సమంతల మధ్య వచ్చే ఐటమ్‌ సాంగ్‌ని రామోజీ ఫిల్మ్‌ సిటీలోని భారీ సెట్‌లో షూట్‌ చేస్తున్నారు. ఈ మేరకు సామ్‌ పోస్టర్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది. ఈ పాట ఈ సంవత్సరం అద్భుతమైన సాంగ్‌గా ఉండబోతోంది అని తెలిపింది. ఈ పోస్టర్‌లో సామ్‌ రంగురంగుల కాస్ట్యూమ్స్‌లో మెరిసిపోతూ…ముందుకు తిరిగి ఉంది. హిందీ కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్య ప్రస్తుతం సెట్‌లో అల్లు అర్జున్‌, సమంతలపై పాటను కంపోజ్‌ చేస్తున్నారు.