హ్యాపీ బర్త్ డే సమంత.. భార్య కోసం చైతూ

హ్యాపీ బర్త్ డే సమంత.. భార్య కోసం చైతూ!!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా సత్తా చాటుతోంది సమంత. పెళ్ళికి ముందే హీరోయిన్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. అక్కినేని వారింట అడుగుపెట్టాక మరింత హవా కొనసాగిస్తోంది. హీరోయిన్ల పెళ్ళికి, కెరీర్‌కి ఎలాంటి సంబంధం లేదని నిరూపిస్తూ ప్రేక్షాధారణ పొందుతోంది. ఒకరకంగా చెప్పాలంటే పెళ్లి చేసుకున్నాకే ఆమె వరుస హిట్స్ అందుకుంది. పెళ్లయింది కదా అని గ్లామర్ ఒలకబోయడంలోనూ ఏ మాత్రం షరతులు పెట్టకపోవడం సమంతలో దాగిఉన్న వృత్తి ధర్మానికి నిదర్శనం.

సమంత నేడు (ఏప్రిల్ 28) తన 33వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు భార్య సమంత కోసం నాగచైతన్య సొంతంగా ఇంట్లోనే కేకు రెడీ చేసి ఆమెతో కట్ చేయించారు. ఈ పిక్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన సమంత.. తాను దేని గురించి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానో గెస్ చేయలేరు అని పేర్కొంది. మొత్తానికైతే మోడ్రన్ కోడలిగా, స్టార్ హీరోయిన్‌గా సమంత కొనసాగిస్తున్న జోష్ హీరోయిన్లు పెళ్ళైతే నటనకు పనికిరారనే అపోహలకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది.