సమంతకు అన్ని కోట్ల రెమ్యునిరేషనా..!

సమంత వెబ్‌సిరీస్‌లోనూ రాణిస్తోంది. తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ‘ది ఫ్యామిలీ మేన్‌ -2’ వెబ్‌ సిరీస్‌లో ఆమె నటించిన రాజీ పాత్రకు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆమె రాజీ పాత్రలో నటించినందుకు గాను, అమెజాన్‌ డిజిటల్‌ సంస్థ సమంతకు నాలుగు కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ ఇచ్చిందని టాక్‌ వినిపిస్తోంది. కాగా.. ఇప్పుడు తాజాగా ఆమె మరో వెబ్‌ సిరీస్‌లో నటించడానికి సిద్ధమౌతున్నట్లు సమాచారం. ఈ వెబ్‌సిరీస్‌ను మరో డిజిటల్‌ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించబోతుందని తెలుస్తోంది. అందులో భాగంగా సదరు డిజిటల్‌ సంస్థ సమంతకు దక్షిణాదిలో ఏ హీరోయిన్‌కు ఇవ్వనంత భారీ రెమ్యునరేషన్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తోందట. ఈ సిరీస్‌లో నటించినందుకుగాను సమంతకు ఎనిమిదికోట్ల రూపాయలు ఆఫర్‌ చేసినట్లు నెట్టింట్లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.