ఇంటర్నేషనల్‌ మూవీలో సామ్‌

సమంత అభిమానులకు గుడ్ న్యూస్… సామ్ ఓ ఇంటర్నేషనల్ మూవీకి సైన్ చేసింది. అన్ని అడ్డంకులు, సరిహద్దులను చెరిపేసేందుకు మరో ప్లాన్ వేసింది. సౌత్ లో పాపులర్ అయిన సామ్ అందరికీ షాకిస్తూ బాలీవుడ్ బడా హీరోయిన్లకు సైతం దొరకని అవకాశాన్ని పట్టేసింది. తాజాగా సమంతా తన తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. ఆ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గతంలో ‘డోంటన్ అబ్బే’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఫిలిప్ జాన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆసక్తికరంగా ఈ చిత్రంలో సామ్ 27 ఏళ్ల ద్విలింగ మహిళగా బోల్డ్ పాత్రలో కనిపించనుంది. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌’ను సునీతా తాటి ప్రొడక్షన్ హౌస్ గురు ఫిల్మ్స్ నిర్మిస్తుంది. సమంత ‘ఓ బేబీ’ సినిమాని సహ-నిర్మించిన బ్యానర్ ఇది! ఈ చిత్రం తారాగణం, సిబ్బంది, షూటింగ్ ఫార్మాలిటీస్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.