నేటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభమైంది. మేడారానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. నేడు పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకోనున్నారు. ఆనవాయితీ ప్రకారం పెనుక వంశస్తులు మహబూబాబాద్ జిల్లా పోనుగొండ్ల నుంచి.. సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకురానున్నారు. పడిగిద్దరాజును తీసుకు వచ్చేందుకుు కాలినడకన 66 కి.మీ.అటవీ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంది. పెనుక వంశస్తులు కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని సైతం తీసుకురానున్నారు.
