డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ ‘పరంపర’ సీజన్ 2 వచ్చేసింది. ఈ వెటబ్ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. సిరీస్ విడుదలవుతున్న సందర్భంగా నటుడు శరత్ కుమార్ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకు ఒక గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ ఈ సిరీస్‌లో చేస్తున్నాను. ఈ పాత్ర పూర్తిగా విలన్‌తో ఉండదు. మరొకరి వల్ల ఎదిగాడనే పేరును తట్టుకోలేడు. అదొక్కటే అతని సమస్య. మొత్తానికి భిన్నమైన సమస్య. పొన్నియన్ సెల్వన్ సినిమా కోసం నాలుగేళ్లు గెడ్డం లుక్ అలాగే ఉంచుకోవాల్సివచ్చింది. అదే గెటప్ లో ఈ వెబ్ సిరీస్ లో నటించాను. థియేటర్లకు జనాలను రప్పించాలంటే ఇప్పుడు శ్రమ పడాల్సి వస్తోంది.
