‘ఒకే ఒక జీవితం’ సెప్టెంబర్ 9న విడుదల

నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమల అక్కినేని, శర్వానంద్, నాజర్, రీతూ వర్మ, ప్రియదర్శి పులికొండ, వెన్నెల కిషోర్, అలీ తదితర భారీ తారాగణం వుంది. చిత్రానికి సుజిత్ సారంగ్ కెమెరాను అందించగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీజిత్ సారంగ్ ఎడిటర్ గా , సతీష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో  తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్, అమల అక్కినేని, నాజర్, రీతూ వర్మ రెండు భాషల్లోనూ తమ పాత్రలని పోషించారు.