మళ్లీ రాజకీయాల్లో శశికళ

 తమిళనాట మళ్లీ రాజకీయాలు వేడెక్కబోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఏఐఏడీఎంకేలో నిరసన గళం విన్పిస్తోంది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇప్పుడు మరోసారి రాజకీయాలు హాట్‌హాట్‌గా మారనున్నాయి. ఎన్నికలకు ముందు జైలు నుంచి విడుదలైన జయలలిత నెచ్చెలి శశికళ అప్పుడే రాజకీయాల్లో వస్తారని ఆశించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరిగాయి. విడుదలై బెంగుళూరు నుంచి చెన్నై వస్తున్న సందర్బంగా జరిగిన ర్యాలీ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఆమె వస్తుందని తెలియగానే ఏఐఏడీఎంకే వర్గాల్లో కలవరం ప్రారంభమైంది. ఏమైందో గానీ..హఠాత్తుగా రాజకీయాల్నించి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించారు.