ఏపీలో ఆగస్టు 16 నుంచి స్కూల్స్‌ ఓపెన్‌

ఏపీలో ఆగష్టు 16 నుంచి స్కూల్స్‌ పున: ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ నెమ్మదించడంతో స్కూల్స్‌ను మళ్లీ తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విధివిధానాలను త్వరలో విద్యాశాఖ వెల్లడించనుంది. శుక్రవారం ఉదయం విద్యాశాఖకు సంబంధించి నాడు-నేడు సమీక్షను సిఎం జగన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగష్టు 16 నుంచి పాఠశాలలను పున: ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేరోజున విద్యార్థులకు విద్యా కానుక కిట్టులను విద్యాశాఖ అందించనుంది. రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌ ప్రభావం ఎలా ఉంటుందనే విషయమై ఇంతవరకు స్పష్టత లేదు. ఎక్కడయితే కోవిడ్‌ కేసులు తక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో స్కూల్స్‌ను తెరవొచ్చని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గులేరియా సూచించారు