టీవీ సీరియల్‌ నటుడికి కరోనా

కరోనా మహమ్మారి ఏ రంగాన్ని వదలడం లేదు. తాజా టీవీ కళాకారులను కూడా కరోనా భయపెడుతోంది. మా ఇంటి గృహలక్ష్మీ సీరియల్‌ నటుడు హరికృష్ణకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంత ఈరోజు షూటింగ్‌ను రద్దు చేశారు. ఈ సీరియల్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ప్రభాకర్‌కు మొదట కరోనా వచ్చింది. ఆయనతో కలిసి తిరగడంతో హరికృష్ణకు కూడా పాజిటివ్‌గా తేలింది. ప్రభాకర్‌తో కాంటాక్ట్‌ అయిన 33 మందిని పరీక్షించారు. ఈ పరీక్షల ఫలితాలు రాకముందే టీవీ సీరియర్‌ షూటింగ్‌ మొదలుపెట్టారు. కాగా షూటింగ్‌లో పాల్గంటున్న ఆర్టిస్టులకు బీమా చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.