నా భర్త అమాయకుడు- శిల్పాశెట్టి

పోర్న్‌ రాకెట్‌ కేసులో పట్టుబడ్డ రాజ్‌ కుంద్రా భార్య, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టిని ముంబయి పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. కుంద్రా వ్యాపారాలతో శిల్పాకు ఏమైనా సంబంధాలున్నాయా? అనే విషయంపై పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. మొబైల్‌ యాప్‌ ‘హాట్‌షాట్స్‌’లో ఎటువంటి అంశాలుంటాయో తన భర్తకు తెలియదని,తన భర్త అమయాకుడని శిల్పా చెప్పినట్లు ముంబయి పోలీసులు చెప్పారు. లండన్‌లో ఉండే కుంద్రా బావ ప్రదీప్‌ బక్షికి చెందినదే ఈ హాట్‌షాట్స్‌ యాప్‌ అని తెలిపారు. అందులో ఎటువంటి కంటెంట్‌ వస్తుందో తన భర్తకు తెలియదన్నారు. అశ్లీల చిత్రాల నిర్మాణంలో తన భర్త రాజ్‌కుంద్రాకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ప్రణయానికి, శృంగారానికి తేడా ఉందని పేర్కొన్నారు. మరోవైపు అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలతో సోమవారం అరెస్టైన రాజ్‌కుంద్రాకు జులై 27 వరకూ పోలీస్‌ కస్టడీని పొడిగిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది.