సుశాంత్ ఇంట మరో విషాదం

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాంద్రాలోని తన నివాసంలో ఆయన బలవన్మరణానికి పాల్పడటం యావత్ సినీ లోకంలో షాకింగ్ పరిణామం అయింది. అయితే ఇంతలోనే అదే ఇంటినుంచి మరో మరణవార్త బయటకు రావడం ప్రతీ హృదయాన్ని కలిచివేస్తోంది. సుశాంత్ వదిన (కజిన్‌ బ్రదర్‌ భార్య) సోమవారం రోజు కన్నుమూశారు. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని తట్టుకోలేక, ఆ బాధతోనే ఆమె మరణించారని తెలుస్తోంది.

సుశాంత్ మరణవార్త తెలిసినప్పటి నుంచే తీవ్ర విషాదంలో మునిగిపోయిన ఆమె.. అప్పటి నుంచి ఆహారం కూడా తీసుకోవడం మానేసింది. దీంతో నీరసించిపోయి బీహార్‌లోని పూర్ణియాలో కన్నుమూసింది. ముంబైలో సుశాంత్‌ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆమె మరణించడం సుశాంత్ కుటుంబానికి రెట్టింపు శోకాన్ని మిగిల్చింది.