ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కాన్వాయ్‌పై ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల వ్యవధిలోనే జరిగిన ఈ ఘటనలో ఆప్ కార్యకర్త ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సౌత్ వెస్ట్ ఢిల్లీలోని కిషన్‌ఘర్ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందిన నరేష్ యాదవ్.. తన అనుచరులతో కలిసి గుడికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మెహ్రౌలి ఎమ్మెల్యే కాన్వాయ్‌పై ఏడు రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన ఓ వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది.
